జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్.
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు సెప్టెంబర్ 27:
మణుగూరు సింగరేణి ఏరియాలోని GM కార్యాలయం నందు శుక్రవారం నాడు భారతీయ స్వాతంత్ర సమరయోధుడు,తెలంగాణ తొలితరం ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ, బాపూజీ అదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించారని, బాపూజీ మహాత్మా గాంధీతో కలిసి వారి స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, తదుపరి తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో నిజాం, రజాకార్ల దౌర్జన్యాలకు,నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారని ఆయన కొనియాడారు.తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి మంత్రి అని అన్నారు.అదే విధంగా తెలంగాణ ఉద్యమ ఆందోళనలకు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఒక ఉద్యాన యూనివర్సిటీకి వారి పేరును నామకరణం చేయడం వారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని, జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు,త్యాగాలు చేసిన బహుభాషా కోవిదుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేందుకు అహర్నిశలు కృషి చేసిన ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని మనమందరం తెలంగాణ గడ్డ ఘన కీర్తిని దశ దిశల చాటెందుకు మనమందరం త్రికరణ శుద్ధితో పాటుపడాలని జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్,ఏజిీఎం (సివిల్) డి వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజినీర్ ఆర్ శ్రీనివాస్,ఏరియా రక్షణ అధికారి వెంకట రామారావు,డిజిఎం (పర్సనల్) ఎస్ రమేశ్,డిజిఎం (ఐఈడిో) కే వెంకట్ రావు,డిజిఎం (పర్చేస్) శ్రీనివాస మూర్తి,డిజిఎం (ఫైనాన్స్) శ్రీమతి అనురాధా, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,ఏరియా రక్షణ అధికారి కే శ్రీనివాస్,సీనియర్ ఐటి ప్రోగ్రామ్మర్ సాయిల సురేశ్,ఇతర అధికారులు,ఏఐటియూసి నాయకులు రాంనర్సయ్య ,రాజ శేఖర్,పిఏ టు జిఎం రాంబాబు,జిఎం ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.