మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏ.బి ఫంక్షన్ హాల్ లో *అక్టోబర్ 8వతేదీన మంగళవారం* నాడు *పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా* ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్* ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ మాట్లాడుతూ…
మహబూబాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళా THREDZ IT గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 40+ కంపెనీలకు పైగా పాల్గొనడం జరుగుతుంది. కనీస వేతనం 12000/- నుంచి మొదలు ఉంటుందని, 10వ తరగతి, ఇంటర్, డిప్లమో, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అండ్ ఫార్మసీ మొదలగు విద్యార్హత కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కేకన్ తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వాల్ పేపర్ లోని స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే బయోడేటా ఫామ్ ఉంటుంది అందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మెగా జాబ్ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు బయోడేటా ఫామ్ తో పాటు జిరాక్స్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ దేవేందర్, బయ్యారం సీఐ రవి, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్బి సీఐ చంద్రమౌళి, THREDZ IT గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారు చందర్, సందీప్ పాల్గొన్నారు.