+91 95819 05907

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వం ఇచ్చిన హామీనీ అమలు చేయాలి హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్

* *ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ*

*హనుమకొండ జిల్లా*
*14 నవంబర్ 2024*

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 17న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్ లు పిలుపునిచ్చారు. గురువారం రోజున హనుమకొండ బాలసముద్రంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా ప్రథమ మహాసభల కరపత్రాలను ఏఐటీయూసీ మరియు ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్ లు మాట్లాడుతూ
పాలక ప్రభుత్వాలు మారిన ఆటో డ్రైవర్ల సమస్యలు మారడం లేదని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక వయస్సు పైబడినా నిరుద్యోగులు కూడా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, ఆపద ఉంది అంటే నేను ఉన్నానని ముందుకు వచ్చి వారిని అర్థరాత్రి వేళల్లో హాస్పిటల్ కు గాని, వారి గమ్య స్థానాలకు చేర్చే వారదులు ఆటో డ్రైవర్లని తెలిపారు. గత బిఆర్ఎస్ సర్కార్ ఆటో డ్రైవర్ల సమస్యలను పెడ చెవిన పెట్టడంతో దానిని గద్దె దింపి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఇంకా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు. గత పాలకుల లాగే ఆటో కార్మిక డ్రైవర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడంతో కార్మికులకు చెందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని అన్నారు.ఈ ప్రభుత్వం ఏకంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో కార్మికుల కుటుంబాలను వీధిన పడవేసిందని, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వ ఆదుకుంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం దారణమని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.10లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపచేయాలని, 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని, అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ,ఈనెల 17వ తేదీన హనుమకొండ బాలసముద్రంలో ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా ప్రథమ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను ఆటో డ్రైవర్ల విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా మాలోతు శంకర్ నాయక్, హనుమకొండ జిల్లా ఏఐటియుసి సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, రేణుకుంట్ల దుర్గ ప్రసాద్, లంక దాసరి అశోక్, సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, ఇల్లందల రాములు, జిల్లా నాయకులు ఆర్ పూర్ణ చందర్, విజయ్ కుమార్, వి. వెంకన్న, మేకల శంకర్, ఆర్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !