చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండల కేంద్రంలో బిఎస్ రామయ్య భవనం లో కామ్రేడ్ పామర్ బాలాజీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్ల సిపిఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు మాట్లాడుతూ ఈనెల 22న చర్ల శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగే సిపిఎం తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయాలని ఈ మండల అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటాలు చేసింది .ఎర్ర జెండా ఒక్కటే అని అది సిపిఎం మాత్రమే అని ఆయన అన్నారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభను ఒక పండుగ వాతావరణంలో జరగనుంది
మండలం లో ఉన్న పార్టీ శ్రేణులు శాఖా కార్యదర్శులు సానుభూతిపరులు తప్పనిసరిగా హాజరు అవ్వాలని ఈ మహాసభ చర్ల మండల అభివృద్ధి కొరకు మండలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద చర్చ చేయడం జరుగుతుందని భవిష్యత్ కార్యాచరణకు చర్ల మండలంలోని ప్రధాన సమస్యలైనా ఒద్దిపేట చెక్ డ్యాం సుదీర్ఘకాలంగా పాలకుల మోసాలకు, వాగ్దానాలకు బలై ఉన్నదని తిరిగి వద్దిపేట చెక్ డాం పోరాటం కొనసాగిస్తామని, అలాగే మండలంలోని అంతర్గత రోడ్లు, కరెంటు, మంచినీళ్లు, పోడు భూముల సమస్య అలాగే ఇళ్ల స్థలాల సమస్య మొదలగు సమస్యలపై ఈ మహాసభలో తీర్మానించబోతుందని
సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు..
ఈ మహాసభకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు హాజరవుతారని ఈ సమావేశంలో మండల నాయకులు అందరూ హాజరయ్యారు
చర్ల మండల కమిటీ.