నేటి గదర్ న్యూస్ నవంబర్ 14: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
జూలూరుపాడు:బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు మెమొరాండం అందించి అనంతరం కార్యక్రమంలో బి.ఎస్.పి మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ
మండల వ్యాప్తంగా భూములు ఉండి పట్టా హక్కులు లేక ఎస్సీ బీసీ మైనార్టీ సామాజిక వర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని వారన్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల రైతులు పహాని నకలు పట్టుకొని బ్యాంకుల వద్దకు వెళితే బ్యాంకు అధికారులు పహాని నకలు తీసుకొని లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నవి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి దళిత రైతుకు పట్టా హక్కులు కల్పిస్తామని మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకోవాలని వారన్నారు తక్షణమే ఎస్సీ బీసీ మైనార్టీ రైతులకు వారి భూములపై వారికి హక్కులు కల్పించి పట్టాలు ఇచ్చేలాగా చొరవ తీసుకొని భూములు ఉండి వ్యవసాయం చేసుకుంటూ పట్టా హక్కులు లేనటువంటి ఎస్సీ, బీసీ మైనార్టీ రైతులకు తక్షణమే వారి భూముల పై వారికి హక్కు పట్టాలు కల్పించాలని కోరుతూ జూలూరుపాడు తాసిల్దార్ స్వాతి బిందు కి మెమరాండం అందించడం జరిగినదని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
బీఎస్పీ పార్టీ మండల కార్యదర్శి గార్లపాటి సైదులు, పార్టీ మండల మహిళా నాయకురాలు భోగ లలిత, నీలాల అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.