చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
ఆదివాసి ఉద్యమాల ఆరాధ్యుడు బిర్సా ముండా
సత్యనారాయణపురం ఎస్టి హాస్టల్ నందు 150వ జయంతి
పిసా చట్టం ప్రకడ్బందీగా అమలు చేయాలి.
ఆదివాసీల పోరాటాల ఆద్యుడు బిర్సా ముండా అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ అన్నారు. సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్లో జరిగిన జయంతి సభలో మాట్లాడుతూ స్వతంత్రం పోరాటాల ఆరాధ్యుడని బ్రిటిష్ వారి నుంచి ఆదివాసి హక్కుల కొరకు పోరాటం చేసినాడని ఆదివాసీల ఐక్యతతో ఆనాడు పోరాటాలు సంసిద్ధం చేసి హక్కులకై బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన నాయకుడని అన్నారు ఇదే కాకుండా ఆనాటి కాలంలో బలవంతపు మత మార్పిడి చేసే క్రమంలో ఆదివాసీల ఐక్యం చేసి పోరాటం చేసినాడు అని అలాంటి నాయకుడికి ఘనమైన నివాళి అర్పించాలని ఇదే కాకుండా గ్రామాల్లో జరిగే *పీసా చట్టాలు పకడ్బందీగా అమలుచెయాలి* ఆదివాసి హక్కులు జీవో నెంబర్ 3 మరియు కాబోయే చట్టాలను రూపకల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నదని అన్నారు గ్రామసభల ద్వారా ఇక్కడ రాంపులు మరియు గ్రామంలో పీసా అనేది కీలకమైనదని అనేక చట్టాలు హక్కులు ప్రభుత్వాలు ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.