+91 95819 05907

ఘనంగా నిర్వహించిన జన్ జాతి గౌరవ దివస్ దినోత్సవం

అభివృద్ధి బలి పీఠం పైన ఆదివాసీలు…

ఆదివాసీలు స్వయం పాలన ప్రకటించు కుంటారు..

నేటి గద్దర్ వెంకటాపురం

25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి గొప్ప కథానాయకుడయ్యారు. బ్రిటిష్ పాల కులు, స్థానిక భూస్వాములు గిరిజనుల భూములు ఆక్రమించి అనేక దురాగతాలకు పాల్పడుతున్న రోజుల్లో- భగవాన్ బిర్సా నాటి సామాజిక ఆర్థిక అన్యా యాన్ని ఎదిరించి నిలిచారు. ప్రజల హక్కుల కోసం పోరాడారు. ధర్తీ ఆబా(భూమికి తండ్రి)గా ప్రసిద్ధుడైన భగవాన్ బిర్సా 1890 దశకం చివరిలో ‘ఉల్గిలన్’ పేరిట బ్రిటిష్ అరాచక శక్తులపై జరిగిన ఒక గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ‘ఉల్లలన్’ న్యాయం కోసం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటం కూడా. బిర్సా భగవాన్ అడవిబిడ్డలు తమ భూమిని తామే సాగుచేసుకునే హక్కు కోసం, గిరిజన జాతుల ఆచారాలు, సాంఘిక విలువలకు గౌరవం తీసు కురావడం కోసం పోరాడారు. మహాత్మా గాంధీ మాదిరిగానే ఆయన చేసిన పోరాటమూ సత్యం, న్యాయం లక్ష్యాలుగా సాగింది.
భగవాన్ బీర్సా ముండా 150 వ జయంతి వేడుకను ఆదివాసీ నవనిర్మాణ సేన, ఆదివాసీ సంక్షేమ పరిషత్, గొండ్వాన సంక్షేమ పరిషత్, తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో వెంకటాపురం ప్రభుత్వ విశ్రాంతి భవనం యందు ఘనంగా నిర్వహించారు.నాయకులు బిర్సా చిత్ర పటానికి పూలమాల వేశారు. అనంతరం ఏ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్ మాట్లాడుతూ బీర్స ముండా జాతి కోసం చేసిన పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకం గా స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొన్నాడని అన్నారు. పోరాటం లో పలుమార్లు జైలు జీవితం గడిపినట్లు తెలిపారు.

ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతూ ఈ దేశ మూల వాసుల గత చరిత్రను చరిత్ర పుటల్లో నుండి తొలింగించే కుట్రలు నేటి పాలకులు చేస్తున్నారని మండిపడ్డారు. 1857 సిఫాయిల తిరుగు బాటు కంటే ముందే 17 శాతబ్దం లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నట్టు చరిత్ర తెలుపు తోందని అన్నారు. ఆదివాసీల వీరోచిత పోరాటాలు ఆదర్శవంతం అయినవని పేర్కొన్నారు. ఈ దేశ అభివృద్ధిబలి పీఠం పైన ఆదివాసీల బ్రతులు కొన ఊపిరి తో ఉన్నాయని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతం లోని విలువైన ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంది పొట్లవలె దోచుకుంటున్నారని ధ్వజం మెత్తి నారు . గిరిజన చట్టాల అమలులోగిరిజన ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్ర పోతున్నట్లు జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా కార్యనిర్వాహన అధ్యక్షులు ప్రతాప్ ఆరోపించారు.గిరిజన ఎమ్మెల్యేలు అయి గిరిజనేతరుల చుట్టూ ప్రదక్షణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఆదివాసీల భూముల పైన 144 సెక్షన్స్ పెట్టించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తుడుందెబ్బ జిల్లా నాయకులు సిద్ద బోయిన సర్వేస్వర్ రావు, కుచ్చింటి చిరంజీవి మాట్లాడుతూ, గిరిజన ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లనే గిరిజన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివాసీలలో నిరుద్యోగం, నిరక్ష రాస్యత అధికం అవుతున్న గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు. గిరిజన చట్టాలను గిరిజనేతరుల అభివృద్ధి కోసం ఎలా తాకట్టు పెడుతున్నారని నిలదీశారు. వెంకటాపురం మండల కేంద్రంలో అక్రమంగా వెలుస్తున్న భవనాలను తక్షణమే కూల్చక పోతే త్వరలోనే వేలాది మంది ఆదివాసీలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పాలకులు షెడ్యూల్డ్ ప్రాంత పరిపాలనను పట్టించు కోవడం లేదు కనుక, రాజ్యాంగం లో పేర్కొనబడిన విధంగా షెడ్యూల్డ్ ప్రాంతం లో స్వయం పాలన ప్రకటించు కుంటామని ఈ సందర్బంగా నాయకులు తెలిపారు. మడకం రవి, గోపి, మహేష్, భీమయ్య, వెంకటాష్ తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

 Don't Miss this News !