నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 15:
రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి సీతక్క గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకు కన్నాయిగూడెం మండలంలోని ODCMS -గుర్రెవుల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మండల కాంగ్రేస్ నాయకులు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా మరియు మండల. ఇంచార్జి జాడి రాంబాబు గారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటనీ దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఎర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధరనీ పొందాలని సూచించారు అలాగే సెంటర్ ఇన్చార్జి పి. వెంకటేష్ గారిని రైతులకు సహకరించి సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించి వారికి కావలసిన సదుపాయాలు ఎర్పాటు చేసి రైతులను ఎటువంటి విషయంలో ఇబ్బంది చేయకుండా మీకు కావలిసిన డాకుమెంట్స్ తీసుకోని రైతులు అమ్మిన ధాన్యం డబ్బులు త్వరగా వారికీ ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని సెంటర్ ఇంచార్జి గారిని కోరడం జరిగింది, అలాగే రైతులు కూడా సెంటర్ ఇంచార్జి గారికి సంహకరించగలని కోరారు ఇటీవల కాంగ్రేస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం సన్న వరి ధాన్యానికి 500/రూపాయల బోనస్ కూడా రైతుల ఖాతాలో జమ కానున్నాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, మండల నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అన్ని సంఘాల అధ్యక్షులు నాయకులు, గ్రామాల, మరియు మండల జిల్లా కిసాన్ కాంగ్రేస్ సీనియర్ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు