రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 18:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆరవ వార్డులో సీతయ్య గుడి వద్ద ప్రముఖ సంఘ సేవకుడు పుట్టి సందీప్ ఆధ్వర్యంలో తన తల్లి పుట్టి బాలమణి జ్ఞాపకార్థం సోమవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణానికి చెందిన వీటి ఠాకూర్ హాస్పటల్ డాక్టర్ లింబాద్రి మరియు మాక్స్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పట్టణంలో నిరుపేద మహిళా వృద్ధులు మరియు పట్టణ ప్రజలు 250 మంది వరకు రావడం జరిగిందన్నారు.ఉచితంగా 150 మందికి కంటి పరీక్షలు,60 మందికి ఆపరేషన్లు 90 ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.తలనొప్పి మోకాళ్ళ నొప్పులకు విటమిన్ సి మాత్రలు కంటికి సంబంధించిన మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.తన తల్లి బాలమణి జ్ఞాపకార్ధంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా వృద్ధులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.