చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం.
తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి.
రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా పోరాటాల ప్రణాళికను రూపొందించడానికి నేడు జరిగే చర్ల మండల 9వ మహాసభకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు, శాఖ సభ్యులు, మండల కమిటీ సభ్యులు విధిగా హాజరై మండల మహాసభను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు కే .బ్రహ్మచారి పిలుపునిచ్చారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణం లో జరుపుకునే ఈ మహాసభలో మండల వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రజా సమస్యలను వెలికి తీసి వాటిపై తీర్మానాలు చేసి పోరాటాల ప్రణాళికను రూపొందించి ప్రజల ప్రజా సంక్షేమానికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళా సమస్య, అగ్నిమాపక కేంద్రం సమస్య, వద్దిపేట చెక్ డాం సమస్య, మేజర్ గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డ్ సమస్య తాగు సాగు నీటి సమస్య విద్యా వైద్యం సమస్య తోపాటు ఎన్నో సమస్యలను వెలుకు తీసి వాటిపై జిల్లా మండల కమిటీలు తీర్మానం చేసి రాష్ట్ర కమిటీ కి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ప్రతి ఒక్క సిపిఎం పార్టీ కార్యకర్త నేడు స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగే 9వ మండల మహాసభకు ఇదిగా హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మచ్చ రామారావు మండల కమిటీ సభ్యులు పొడుపుగంటి సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, దొడ్డి హరినాగవర్మ, పామారు బాలాజీ పాల్గొన్నారు.