చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం గ్రామ ప్రజలు రైతులు తమ తమ చేల్లోకి వెళ్లే రెవిన్యూ ల్యాండ్ ను సైతం కబ్జాలో ఉందని, దీనివలన రైతులకు అనేక నష్టాలు జరుగుతున్నాయని, వ్యవసాయ పనిముట్లు గాని ఎరువులు గాని రైతులు పట్టికెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని, తిప్పాపురం గ్రామ మాజీ సర్పంచ్ అయిన కన్నారావు తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు, ఈ కబ్జా విషయమై తాసిల్దార్ కి వివరంగా వివరించి గ్రామ ప్రజలు రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, తాసిల్దార్ కి తెలియజేసి వెంటనే కబ్జాకు గురైన రెవిన్యూ ల్యాండ్ ను సర్వే చేయించి సరిహద్దులు వేపించాలని. తాసిల్దారుకు తిప్పాపురం మాజీ సర్పంచ్ కన్నారావు గ్రామ పెద్దలు రైతులు కలిసి తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.