+91 95819 05907

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.

తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, కెవిపిఎస్ ,ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం లోని అంబేద్కర్ సెంటర్లో వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం రైతులపై నిర్బంధం ప్రయోగించి భూములను సేకరించడం కోసం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ బుధవారం నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పై తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం వివిధ సంఘాల నాయకులు బొంతు రాంబాబు ,మాచర్ల భారతి, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతంగా లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేయడం సరికాదని రాజ్యాంగ చట్టాలని ఉల్లంఘించి రేవంత్ రెడ్డి అఖిలపక్షం అభిప్రాయాలు తీసుకోకుండా గిరిజనుల ,పేదల భూములను లాక్కోవడం అన్యాయమని వారన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‌ఫార్మాసిటీని వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు లగచర్లలో భూసేకరణ జరపడం అన్యాయం అన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ కోసం 15 వేల ఎకరాల భూములు సేకరించిరన్నారు .దాని రద్దు చేయకుండా ఫోర్త్ సిటీ పేరుతో లగచర్లలో రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకోవడం తగదని వారన్నారు విదేశీ కంపెనీల ద్వారా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పడం అంటే విదేశీ కంపెనీలకు భూములు అప్పగించటమేనని వారన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు తమ భూములను తీసుకుంటే జీవనోపాధి కోల్పోతామన్న ఆవేదనతో ఉన్న రైతులను నిర్బంధాలు తో ఆయా గ్రామాల్ని జైలుగా మార్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్బంధాలు విధించిన వాళ్లు రాజకీయంగా ఏమయ్యారో గుర్తు పెట్టుకోవాలని వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ సభలు జరపాలని 2013 చట్టం ప్రకారమే 80 శాతం గ్రామ సభలో ఆమోదిస్తేనే భూములు సేకరించాలని లగచర్లలో రైతుల మీద పెట్టిన కేసులను తక్షణం రద్దు చేయాలని లగచర్లలో ప్రశాంత వాతావరణంలో కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పై సంఘాల నాయకులు మాది నేని రమేష్, ఎస్ నవీన్ రెడ్డి, ఎస్.కె హిమాం వరప్రసాద్ మెరుగు రమణ మెహ్రూని స బేగం అమరావతి అజిత బిబి సునీత పి రమ్య భూక్యా శ్రీనివాస్ నాయక్,ముడ్ గన్యా నాయక్, భూక్యా కృష్ణ నాయక్ పాపారావు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్కినాయక్, బాణాల శ్రీనివాసరావు, ప్రసాద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !