మన ఇంటి పండగ మరొక ఇంట్లో విషాదం కాకూడదు
-మాంజా దారాలు వాడితే కేసులు తప్పవు
-ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్
పతంగులను ఎగరేసే ఉత్సాహంలో చైనా మాంజా వాడితే కేసుల తిప్పలు తప్పవని ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన పినపాక మండల పరిధిలోని ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. ఆ ప్రమాదకర దారం అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు.ఈ దారాలు పక్షుల ప్రాణాలకే కాకుండా
రోడ్డుకు అడ్డంగా వేళాడుతూ వాహనదారుల గొంతుకు చుట్టుకొని కోసేసి వాహనదారుల ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసారి కూడా కఠిన చర్యలు తప్పవన్నారు. మాంజా దారాలు అమ్మితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు సైతం నిర్వహిస్తామని తెలిపారు.
Post Views: 231