మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి(62) అంత్యక్రియలు ముగిసాయి.
ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో* బంధువులు, గ్రామస్తులు, సానుభూతిపరుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. *ఈ నెల 19న ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.* ఈ ఎన్‌కౌంటర్‌లో చలపతితో పాటు మొత్తం 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. శనివారం చలపతి మృతదేహాన్ని బొడ్డపాడుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Post Views: 24