బూర్గంపాడు:బూర్గంపాడు ఆర్టీసీ బస్టాండ్ పునరుద్దించాలి అని జాతీయ మానవ హక్కుల సంఘం NHRCOI డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు బూర్గంపాడు బస్టాండ్ ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బూర్గంపాడులోని ఒక దశాబ్దం పాటు వాడుకలో లేకుండా పోయిన ఆర్టీసీ బస్టాండ్ ను మరలా తిరిగి పునరుద్దించాలి. అలాగే వ్యాపారులు రోడ్డు వెంబడి పెట్టకుండా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు లో కాంప్లెక్స్ నిర్మించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని వినియోగించుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్ ఇప్పటికే వాడుకలో లేకపోవడం మరియు ఆర్టీసీ బస్సులను మూల మలుపుల వద్ద ఆపడం వల్ల అవి అతి చిన్న రోడ్లు అవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే రోడ్డు యొక్క వెడల్పు తక్కువ ఉండడం వలన రోడ్డు వెంబడి వ్యాపారాలు పెట్టడం వలన ఆ ప్రదేశం మరి వెడల్పు తక్కువ అవుతుంది. కావున బూర్గంపాడు లో నిర్మించి ఉన్న బస్టాండ్ ను వాడుకలోకి తీసుకొచ్చి మంచి వాతావరణంలో బస్టాండ్ లో కాంప్లెక్స్ నిర్మాణాలు చేసి ఆర్థిక వనరులుగా వినియోగించుకోవాలని రీజనల్ మేనేజర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు బి.వంశీ తేజ, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, గుగులోతు బాబు,పొడుతూరి ప్రేమ్ సాయి, నక్క సాయి బాబు పాల్గొన్నారు
