+91 95819 05907

నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్టు… భద్రాద్రి జిల్లా కు లింక్

*ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల వియ్రాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు నోట్లు 38లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో,తొమ్మిది సెల్‌ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*

*పోలీసులు అరెస్టు చేసిన వారిలో: 1) మణికాల కృష్ణ,57 సంవత్సరాలు, గ్రామం మోరంపల్లి బంజర గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 2) ఎర్రగొల్ల శ్రీనివాస్‌ 36 సంవత్సరాలు,కేశవాపూర్‌ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా 3) బిజిని వేముల వెంకటయ్య,57 సంవత్సరాలు, కుర్వపేట, వేల్పనూరు గ్రామం, కర్నూలు జిల్లా,4) దరామ్సోత్‌ శ్రీను,45 సంవత్సరాలు,నక్రిపేట తండా బుర్గాంపాడ్‌ మండల్‌, భద్రాద్రి కొఠాగుడెం జిల్లా, 5) తేజావత్‌ శివ,34 సంవత్సరాలు, నక్రిపేట తండ బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 6) గుగ్లోత్‌ వీరన్న,26 సంవత్సరాలు, ముకమామిడి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం 7) ఉడుతా మల్లెష్‌, 26 సంవత్సరాలు, , ,కేశవాపూర్‌ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా.8) ఎర్రగొల్ల అజయ్‌, 25 సంవత్సరాలు, పెద్దపాపయ్యపల్లి గ్రామం, హుజూరాబాద్‌ మండలం ఇప్పుడు ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ గ్రామం, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.*

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్‌ వేసాడు. ఈ ప్లాన్‌లో భాగంగా నిందితుడు ప్రధానంగా గొర్రెల వ్యాపారం ద్వారా పరిచమయిన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దోరికిందని అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలు ఎదురౌవుతున్నాయని నమ్మించేవాడు. తనకు ఎవరైన ఒక లక్ష రూపాలు ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండిరతలు ఇస్తానని, అలాగే ఒక లక్ష ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నొట్లను ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహలో నిందితుడు రెండవ నిందితుడైన హనుమకొండ జిల్లా కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్‌తో పరిచయం కావడంతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ వద్ద తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేసాడు. ప్లానులో భాగంగా పాల్వంచ అడవిలో ముందుగా అసలు, నకిలీ రూపాయల నోట్లతో భద్రపర్చిన డ్రమ్ము నుండి అసలు ఐదు వందల రూపాయాల నొట్ల కట్టను ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు చూపించడంతో అవి అసలు నోట్లని నమ్మిన శ్రీనివాస్‌ పదిలక్షల అసలు నోట్లగాను ఇరువై లక్షల రూపాయలు అలాగే ఐదు లక్షల అసలు నోట్లకు ఇరువై లక్షల రూపాయల నకిలీ నోట్లు మార్పిడి చేసుకొనేందుకు నిందితుల ఇద్దరి మద్య అంగీకారం కుదిరింది. కాని తనకు డబ్బును హనుమకొండకు తీసుక వచ్చి అందజేస్తేనే నేను ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని నిందితుడైన శ్రీనివాస్‌ ప్రధాన నిందితుడుకి షరతు పెట్టడంతో ఇందుకు ప్రధాన నిందితుడు అంగీకరించినాడు. నిందితుల ఇద్దరు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రస్తుతం అరెస్టు చేసిన మరో నలుగురు నిందితులతో కారులో నిన్నటి రోజున కేయూసి అవుటర్‌ రింగ్‌రోడ్డుపై పెగడపల్లి క్రాడ్‌ రోడ్డ వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడే వున్న శ్రీనివాస్‌ మరో ఇద్దరు నిందితులతో కల్సి అసలు డబ్బుతో పాటు నకిలీ నోట్లను మార్పిడి చేసుకుంటున్న తరుణంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు ఈ ముఠా సభ్యులందరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద వున్న బ్యాగులు, కారులో తనీఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదుతో పాటు, నకిలీ నోట్లతో పాటు నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోని తీసుకోని విచారించగా నిందితులందరు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు ఇదే తరహలో మరో మిత్రుడి తో కల్సి తెల్ల కాగితాలపై ఐదు వందల రూపాయల నోటు ముద్రించి పలు మార్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వి.యం.బంజర,లక్ష్మీదేవి పేట పోలీస్‌ స్టేషన్‌ల్లో ప్రధాన నిందితుడిపై కేసులు నమోదు అయ్యాయి.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన ఏసిపి దేవేందర్‌ రెడ్డి, కేయూసి ఇన్స్‌స్పెక్టర్‌ రవి కుమార్‌, ఎస్‌.ఐ మాధవ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింగ్‌ రావు, కానిస్టేబుళ్ళు శ్యాంరాజు, సంజీవ్‌, సంపత్‌, హోంగార్డ్‌ రాజేందర్‌లను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !