విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించి, అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి శుభాకాంక్షలు.
పద్మ విభూషణ్ కు ఎంపికైన డాక్టర్ @DrDNReddy గారు వైద్య రంగంలో సుధీర్ఘ కాలంగా విశిష్ట సేవలందిస్తున్నారు.
పద్మ భూషణ్ కు ఎంపికైన బాలకృష్ణ గారు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు, బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.
పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ స్థాపించి, అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
పద్మ శ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణి శర్మ గారు తన ప్రవచనాలు, రచనలతో సమాజాన్ని జాగృతం చేస్తూ, మేల్కొల్పుతున్నారు.
వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని గుర్తించి, పద్మ అవార్డులకు ఎంపిక చేయడం సంతోషించతగిన విషయం.
పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు
Post Views: 54