హలో మాదిగ చలో హైదరాబాద్
ఐ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా దండోరా సమావేశం సందర్భంగా ఈనెల
ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో వేల గొంతులు లక్ష డప్పుల ‘లాంగ్ మార్చ్ సంబంధించిన గోడపత్రిక విడుదల.
హావేళ్ళి ఘణపూర్ మండలం (మెదక్ రూరల్) నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 01.
మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం రోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్ తో సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో లక్ష డప్పులు వేల గొంతుల’తో మాదిగ ల మహాత్తర సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించ బోతున్నాం* ఎస్సీ ఏ బి సి డి ల వ్యతిరేకులపై కక్ష సాధింపు చర్యలు రాజకీయపరంగా మాదిగలు ప్రతీకారం తీర్చుకుంటారని ప్రమాణం చేశారు. చిట్ట చివరి మాదిగ ఉపకులాల కు రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు ప్రతి పేద వాళ్లకు అందాలని ఆకాంక్షిస్తున్నారే అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగ మరియు ఇతర ఎస్సీ కులాల కు తీరని ద్రోహం, మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తో తాడో పేడో తేల్చుకోవడానికి ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో లక్ష డప్పుల ‘లాంగ్ మార్చ్’జరగబోతున్నదని ఇది ప్రపంచచరిత్రలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం అని అందుకు మాదిగలు ఇతర ఎస్సీ కులాలు డప్పులు,ఇతర వాయుద్యాలతో సిద్దం కావాలని అన్నారు ప్రతి గ్రామ మండల పల్లె నుండి ప్రతి మాదిగ బిడ్డ దప్పేసుకుని తల్లి రావాలని పిలుపునిస్తున్నాం*
ముప్పై ఏండ్లుగా సామాజిక న్యాయం కోసం మాదిగలు చేస్తున్న పోరాటానికి అన్ని కులాలు తమ సంఘీభావం ప్రకటించడమే కాకుండా పాలుపంచుకుంటున్నాయని ఇకనైనా స్వార్థపరుల మాటలు నమ్మకుండా ఫిబ్రవరి 7 లోగా ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం*
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కై ఫిబ్రవరి7 న హైదరాబాద్ లో వేల గొంతులు లక్షడప్పులు తో భూమి ఆకాశం దద్దరిల్లేలా ప్రపంచానికే మాదిగల గోడు వినబడేలా మహాత్తర ప్రదర్శన జరగబోతోందని గుర్తు చేస్తూ*…
అందుకు మాదిగలు ఇతర కులాలు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాము* ఏది ఏమైనా తెలంగాణలో వర్గీకరణ సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ జాతికి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా కళా మండలి అధ్యక్షులు మాసాపేట యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ,ఎంఎస్పి మెదక్ జిల్లా అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అస్ర్తగల బాలరాజ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిశెట్టి రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ సినియర్ నాయకులు దండోల సామేలు మాదిగ,మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పల్లేపాటి మాధవి మాదిగ, ఎమ్మార్పీఎస్ సినియర్ నాయకులు కోమ్ము శేఖులు మాదిగ,మద్దురి క్రిష్ణ మాదిగ, స్వామి మాదిగ,చేగుంట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రామస్వామి మాదిగ,నిజాంపేట్ ఎమ్మార్పీఎస్ సినియర్ నాయకులు కోమ్మట సుధాకర్ మాదిగ,పవన్ గట్టయ్య యాదగిరి ప్రతాప్ సాంసంగ్ మరియు తదితరులు పాల్గోన్నారు.