నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సెల్ చైర్మన్ గా సీనియర్ న్యాయవాది వెల్లంకి వెంకటేశ్వర రావుని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ని బలోపేతం చేయాలని పిపీలు,జిపీలు,ఏజీపీలు,
కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడి పని చేసిన వారికి పారదర్శకతో వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు, అలాగే అన్ని బార్లలో నెలకొన్న న్యాయవాదుల సమస్యలను తీర్చడానికి లీగల్ సెల్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ మరియు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గం టిపిసిసి సభ్యులు జేబీ శౌరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ,లీగల్ సెల్ రాష్ట్ర బాధ్యులు ఆకుల సత్యనారాయణమూర్తి, మూమిన్,సీనియర్ న్యాయవాదులు వివి సుధాకర్ రావు, విజయ్ కుమార్, పోసాని రాధాకృష్ణ, మారపాక రమేష్ కుమార్,గడిపల్లి మహేష్,అరకల కరుణాకర్,సాకా రామకృష్ణ,వేల్పుల సుధాకర్,యాస యుగంధర్, నరసింహ చారి, నాగేశ్వరరావు, వడ్లకొండ హరిప్రసాద్, అంకుష్ పాషా, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు…