నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఇటీవల ట్రాఫిక్ ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన శంకరును దిశ ప్రొడక్షన్ వెళ్ళిపోయారు ఫౌండేషన్ సభ్యులు శనివారం శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి మాట్లాడుతూ రక్షణ రంగంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎటువంటి విశ్రాంతి లేకుండా 24 గంటలు 365 రోజులు సేవలందిస్తుంటారని అన్నారు. పోలీస్ శాఖలో అంచలంచెలుగా ఎదుగుతూ ఏఎస్ఐ స్థాయికి ఎదిగిన శంకర్ విధి నిర్వహణలో అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నారని కొనియాడారు. భద్రాచలం అంటే ఏజెన్సీ కేంద్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో భద్రాచలం పోలీస్ శాఖ అభినందనీయంగా పనిచేస్తుందని ఇటువంటి పోలీస్ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించడం స్వచ్ఛంద సంస్థల ప్రధాన బాధ్యత అని అన్నారు. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బివి రాజు ఉపాధ్యక్షురాలు కళ్యాణి ఇలా ఆదేశానుసారం అనేక రకాల సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ ఇటువంటి నిజాయితీ అధికారులను కూడా అభినందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దిశా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు