అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదని ప్రతి పౌరుడు బాధ్యతగా అడవులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కోరారు. బుధవారం పినపాక మండలం, కరక గూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కొత్తగా చెట్లను నరికి పోడు చేయకూడదన్నారు.వన్యప్రా నులను కాపాడుకోవాలని, వన్యప్రాణుల వేట చేయవద్దని సూచించారు. అడవిలో నిప్పు పెట్టకూడదని అడవికి నిప్పు అడవులకే కాక వన్యప్రాణులకు ముప్పు తెస్తుందన్నారు. అటవీ హక్కుల చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు. ఎవరైనా అడవులకు హాని కలిగిస్తే అటవీ శాఖ వారికీ తెలియపర్చి సమాజ శ్రేయస్సుకు, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. నేటి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేయించారు. అడవులు ఉంటేనే సకాలం లో వర్షాలు పడతాయాని, భూగర్భజలాలు పెరుగుతాయాని, స్వచమైన త్రాగునీరు లభిస్తుందని, మంచి ప్రాణవయువు లభించాలంటే పచ్చదనం ఆవశ్యకత ఉందని అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ లు సూరయ్య, ఏడుకొండలు, రాందాసు, బీట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
