★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన
నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం ఓ సమస్యగా మారింది . ఇదిలా ఉండగా మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల ఎల్లయ్య తండ్రి రాజయ్య వయసు 70 సంవత్సరాలు అను వ్యక్తి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తన అల్లుడు రమేష్ తాను రాసి ఇచ్చినట్టు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి పాపన్న గారి వేణు గోపాల్ అను వ్యక్తికి అమ్మినట్టు చెప్పారు. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మా ఉమ్మడి ఆస్తిలో చిచ్చుపెట్టిన నా అల్లుడు రమేష్ పై తగు చర్యలు తీసుకోవాలని చిట్యాల ఎల్లయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజాగ మా అందరి ఉమ్మడి ఆస్తి కాగా అందులో నా అల్లుడైన రమేష్ కు నేను ఏ విధమైన వాటా గాని ఎలాంటి కాగితం పైన గాని జాగా రాసి ఇయ్యలేదన్నారు. లేని కాగితాన్ని సృష్టించిన మా అల్లుడు రమేష్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దొంగ డాక్యుమెంట్లతో ఉమ్మడి ఆస్తి విషయంలో నా అల్లునికి నేనొక్కడినే ఎలా రాసిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ముమ్మాటికి ఇది నకిలీ కాగితాలని దమ్ముంటే ఆ కాగితాలు తీసుకొని స్థలం దగ్గరికి వచ్చి నా అల్లుడు రమేష్ కొన్న వ్యక్తి ఇద్దరు నాతో మాట్లాడాలని హెచ్చరించాడు. లేకపోతే నేనే ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.