నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు . డ్రైనేజ్ , కరెంట్ స్తంభాలు , వీధి లైట్స్ అతి త్వరలో మంజూరు చేయిస్తామని అన్నారు . ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అల్లె సాయికిరణ్ , మొహమ్మద్ ఆశ్రఫ్ , నాళం సతీష్ , బెల్లంకొండ వాసు , బొజ్జడ్ల సత్య నారాయణ , సింగం అంజయ్య , వార శివ ప్రసాద్ , బుర్ల సారంగ పాణి , గూగులోత్ శ్రీనివాస్ , శాసనాల తరుణ్ , మేట్ల రమేష్ , జి నవీన్ , ఎస్కే మీరా , మన్నే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు .
Post Views: 30