రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/- రూపాయలు బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేయడం జరిగింది.తనకు కొంత సమయం కావాలని ఎంత ప్రాధేయపడిన ఆ ఏరియా కు సంబంధించిన స్థానిక లైన్ మేన్ వినిపించుకోకపోగా తక్షణమే విద్యుత్ కనెక్షన్ కట్ చేసి వెళ్లడం జరిగిందని తెలిపాడు.ఒక్కొక్కరు నెలల తరబడి చెల్లించకుండా వారిని కనీసం ప్రశ్నించడం లేదని నిరుపేద అయిన తన పట్ల కావాలని ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు.విద్యుత్ అధికారులు కూడా వేలల్లో ఉన్న కరెంట్ బిల్లులు వసూలు చేయడంలో ఈ ఉత్సాహం చూపడం లేదని తెలిపాడు.పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటున్నారని బాధితుడు వాపోయాడు.ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ తిరుపతి రెడ్డిని వివరణ కొరగా తమకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము బకాయిలు ఎక్కడ కూడా లేకుండా వసూలు చేస్తున్నామని తెలియపరచారు.
