అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఓ షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిపోగా, పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, లియర్‌జెట్ 55 విమానం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫిలడెల్పియా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టెకాఫ్ అయిన 30 సెకండ్లలోనే విమానం కూలిపోవడం వల్ల భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. అయితే విమానంలో ఆరుగురు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు.
Post Views: 25