★చేతి పంపు కు మరమ్మతులు చేయించాలి
నేటి గదర్ న్యూస్, పినపాక:
పినపాక గ్రామంలో ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథనీళ్లు రెండు రోజులగా రావడం లేదు దీనిపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని పినపాక గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కోరుకుంటున్నారు.
అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి చేతి పంపుని బాగు చేయాలని గ్రామపంచాయతీ అధికారులకు సంవత్సరం నుండి బాగు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దీనిపై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
★ఇదే విషయమై పినపాక సెక్రటరీ ఉమ మహేశ్వర రావు ని వివరణ ని కోరగా…మణుగూరు మిషన్ భగీరథ మెయిన్ లైన్ లో సమస్య తలెత్తడంతో భగీరథ త్రాగునీరు రావడం లేదన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.పంచాయతీ ప్రజలు గమనించాలి అని అన్నారు.
Post Views: 62