+91 95819 05907

వైరా మండలం లో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి

రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆదేశించిన కొనుగోలు లేదు
రైతులు నిరసన

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :- వైరా మండలం లో విప్పలమడక, సిరిపురం గ్రామాలలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని మంత్రులు ప్రకటించిన అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం వైరా మండలం విప్పల మడక గ్రామం లో ధాన్యం రాశులు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు జనవరి 31 వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది చివరి తేదీ గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు నిలుపుదల చేశారు అని అన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు అలస్యం కావడం వల్ల వరి కోతలు జనవరి రెండవ వారం లోకూడా జరిగాయి అని అన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు సమస్య పై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దృష్టి కి రైతులు తీసుకువచ్చారు అని ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను రెవెన్యూ మంత్రి అందేశించిన ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారు ,మరో వారం రోజులు ధాన్యం కొనుగోలు గడువు ఇచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో విప్పలమడక మాజీ సర్పంచ్లు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరబంధి, ఎస్ కె జానిమీయా, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, రుద్రాక్షల వెంకటయ్య, దెవభక్తిని అర్జున్ రావు, భద్రయ్య, మురళి, సాంబశివరావు, రామారావు, పుల్లారావు, రైతులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !