నేటి గద్దర్ న్యూస్, మధిర :
_రైల్వే మోరీ లో పైపుల కోసం గుంటలు తవ్వి పైపులు వేసి అసంపూర్తిగా వదిలేసిన పనులు_
మధిర పట్టణాన్ని రైల్వే ట్రాక్ రెండుగా విభజించడంతో పనుల నిమిత్తం వెళ్లేవారు రైల్వే మొరిపై ఎక్కువగా ఆధారపడతారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు ఆర్ఓబి ఎక్కలేక ఈ రైల్వే మోరి నుంచే నడక సాగిస్తూ ఉంటారు నిత్యం వేల సంఖ్యలో ప్రజలునడిచే దారి ఇది. పది రోజుల క్రితం మిషన్ భగీరథ పనుల నిమిత్తం పైపుల కోసం రైల్వే మోరీలో గుంటలు తవ్వి పైపులు వేసి వాటిని పూడ్చకుండా కర్రలు కట్టి వదిలివేశారు. రైల్వే అధికారులు ఆ పనితో మాకు సంబంధం లేదు అంటున్నారు, ప్రజలు విద్యార్థులు, ఇబ్బంది పడుతున్నారు ఆర్ఓబి పై మరమ్మత్తులు జరుగుతున్నందున మోటార్ సైకిల్ పై వెళ్లేవారు ఎక్కువగా రైల్వే మోరి నుంచే వెళుతున్నారు, అలాంటిది రైల్వే మోరి లో పనులు అసంపూర్తిగా వదిలి వేయటం వలన ఆర్ఓబి పై ట్రాఫిక్ రద్దీ పెరిగి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది వెంటనే అధికారులు రైల్వే మోరీ లో ఉన్న గుంటలను పూడ్చి దారిని ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు