+91 95819 05907

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న చలో హైదరాబాద్

★కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.

★బడ్జెట్ ను సవరించి తెలంగాణకు అన్ని రంగాలకు నిధులు కేటాయించాలి

★ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నా జయప్రదం చేయండి.

భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ.

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, తెలంగాణకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ సవరించి తెలంగాణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా వేలాది మందితో జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ కోరారు. మంగళవారం వైరా బోడెపుడి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండలం కార్యదర్శి తూము సుధాకర్ అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు కోత విధించి పేదలకు పనులు దొరకకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యా, వైద్యం ఉపాధిని పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కార్యదర్శి గుమ్మ నరసింహారావు, షేక్ రెహానా బి, షేక్ మజీద్ బి, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !