★ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే భావిద్య వహించాలని ఆటో డ్రైవర్ల డిమాండ్.
మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్ ) ఫిబ్రవరి 5.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి .
పూర్తి వివరాల్లోకెళ్తే మాసాయిపేట గ్రామానికి చెందిన పాపని దశరథ గత కొన్ని సంవత్సరాల నుండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్ వల్ల ఆటోలు సరిగా నడవక ఆర్థికంగా మానసికంగా కృంగిపోయిన పాపని దశరథ 5 ఫిబ్రవరి అర్ధరాత్రి గుండె నొప్పితో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు దశరథ మృతదేహానికి నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరవాలని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్ గురించి చర్చించాల్సిందిగా యూనియన్ డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల పాల్గొన్నారు.