+91 95819 05907

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు

★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి

★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

★పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ప్రముఖులు,గ్రామ ప్రజలు

మెదక్ జిల్లా న్యూస్ నేటి గదర్ (జిల్లా ప్రతినిధి) భూపాల్ మార్చి13.

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట తాజా మాజీ జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మానవత్వం పరిమళించే బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు పురస్కరించుకొని సర్వత్ర హార్దిక శుభాకాంక్షలు తెలిపి అభినందించి పలువురు ఆశీర్వదించారు. ఆది దంపతులైన వీరిద్దరూ జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి అని దీవించారు. ప్రజల కోసం ప్రతిస్పందించే, పరితపించే మనుసున్న ప్రజా ప్రతినిధి మన గ్రామ బిడ్డగా తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ లు అని గ్రామ ప్రజలు కొనియాడారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు పెళ్లి రోజు సందర్భంగా పలువురు జిల్లా నాయకులు మరియు గ్రామ ప్రజలు దీవెనలు అందించి ఆశీర్వదించారు. పూర్తివివరాల్లోకి వెళ్లితే… మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ముద్దుబిడ్డ బుడ్డ రామయ్య బుడ్డ బాలవ్వ మనుమడు, బుడ్డ బాలయ్య పోచవ్వ దంపతుల కొడుకు బుడ్డ భాగ్యరాజ్ చందాయిపేట గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండి తనకు ఉన్న అనుభవంతో గ్రామంలో మంచిచెడులు తెలుసుకున్న భాగ్యరాజ్, సర్పంచ్ ఎన్నికల్లో ఆయన భార్య బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ 2019 వ సంవత్సరంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పోటీ చేయించి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 951మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటినుంచి ప్రజాసేవలో ముందుండి గ్రామంలో నెలకొన్న సమస్యలపై అను నిత్యం అధికారులతో అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత తనపై వేసుకుని ముందుండి నడిచిన వ్యక్తిత్వం అయినది. నిరుపేదలకు అండగా నిలిచి అభాగ్యులను ఆదుకున్న అపర చాణక్యుడు. గ్రామంలో నిరుపేదలుగా ఉన్న వారికి నేనున్నానంటూ ఏ ఆపద వచ్చిన ఇంటికి పెద్ద కొడుకు లాగా మనసున్న మారాజు లాగా ఆదుకునే మనస్తత్వం కలిగిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అని చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లి లు అయితే ఆడపడుచుల తనవంతుగా మేన మామ బాధితులు తీసుకొని ఆ కుటుంబాలకు పుస్తె మట్టెలు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు. అంతే గాకుండా మరణించిన వారికీ ఆర్థిక సహయం చేసి అండగా నిలిచి గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి దశదిన కర్మకు 50 కేజీల బియ్యం తో పాటు కొంత నగదు తో పాటు ఆర్థిక సాయం ఎందరికో అందజేసిన ఘనత భాగ్యరాజ్ దంపతులకు దక్కింది. ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా తనకు తోచినంత సహాయం అందించేవారు. సర్పంచిగా గెలిచిన తర్వాత మెదక్ జిల్లా ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకొని ఉత్తమ సేవకునిగా నిలిచారు. చందాయిపేట గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన అధికారులు ప్రజలకు సేవ చేసిన బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మెదక్ జిల్లాలోని ఉత్తమ సర్పంచిగా ప్రజల ఆశీర్వాదాలతో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే అభివృద్ధి పనులు చేశాడూ. తన పై నమ్మకంతో సర్పంచిగా గెలిపించిన చందాయిపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ గురువారం రోజున 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా పెళ్లి రోజు శుభాాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలకు అధికారులకు ధన్యవాదములు తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, నేను చేసిన సేవలను గ్రామ ప్రజలు గుర్తించి ఆశీర్వదించాలని , ఇకముందు జరగబోయే పనుల్లో ఉన్నత పదవులు సాధించాలని, అలాగే నాపై గ్రామ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు గ్రామ ప్రజలు, మహిళలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువకులు, యువజన సంఘాల నాయకులు, అధికారులు, అనాధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని అక్షాసిస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలే కాకుండా చెగుంట మండలం లోని పలు గ్రామాల్లో తోచిన ఆర్థిక సహాయం, బియ్యం, కిరాణ సామాను అందజేసి అండగా నిలిచిన స్వర్ణలత భాగ్యరాజు చేసిన సేవలకు అపూర్వ స్పందన లభించి యువ దంపతులను గ్రామ ప్రజలు అభినందించి ఆశీర్వదించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !