నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర బలంగా డీ కొట్టటంతో అక్కడిక్కడే మృతి చెందారు. సమీప పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుని భార్య సైదమ్మా, ఇద్దరు కుమారులు కిరణ్, రాజేష్, కూతురు సౌజన్య కోరిక మేరకు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో పుల్లయ్య రెండు కళ్లు నేత్రనిదికి దానం చేసారు….. పుల్లయ్య మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉండి కూడా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం తో పలువురు అభినందించారు. ఈ విషయం తెలుసుకొన్న కొణిజర్ల మండల సిపిఐ పార్టీ మండల కమిటీ మెంబెర్స్ అందరూ దుద్దెపూడి గ్రామానికి చేరుకొని పుల్లయ్య పార్థివాదేహానికి సిపిఐ పార్టీ జెండాతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దుద్దెపూడి సిపిఐ కార్యకర్తలు అమర్లపూడి లాజర్, అనిల్, ఏసోబు, బాలశోరి, పాల్గొన్నారు.
