నేటి గదర్ న్యూస్ జనవరి 05, ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891
చనిపోయిందని అనుకున్నారు .
తిరిగి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోయారు.
తిరుపతిలో తప్పిపోయిన మతిస్థిమితం లేని మహిళ.
మధిరలో ప్రత్యక్షం.
మిస్సింగ్ కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన తిరుపతి అలిపిరి పోలీసులు.
వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు దోర్నాల రామకృష్ణ
మధిర టౌన్ పోలీసులకు ఆర్కే ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన బంధువులు.
కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా ఒక మహిళ సంచరిస్తూ ఉండడంతో పెట్రోల్ బంకు సిబ్బంది మధిర టౌన్ పోలీసులకు తెలియజేశారు. వెంటనే నైట్ పెట్రోలింగ్ బ్లూ కోట్ కానిస్టేబుల్ బాణావత్ కొండ సదరు మహిళ వద్దకు వెళ్లి వివరాలు అడగగా ఏమి చెప్పలేని పరిస్థితులలో ఉన్న మహిళకు మతిస్థిమితం లేదని గ్రహించి ఆర్కే ఫౌండేషన్ వారికి తెలియజేసి అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి మహిళకు కొన్ని రోజులు సపరియలు చేసి మహిళ వివరాలు అడుగగా ఖమ్మం వద్ద అని చెప్పటంతో ఆ దిశగా సోషల్ మీడియా ద్వారా బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. కానీ సదరు మహిళది ప్రకాశం జిల్లా ఖంబం దగ్గర కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి సోషల్ మీడియాకు తెలియజేశారు. వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూసిన కుమారుడు కుమార్తెలు తమ తల్లి బ్రతికే ఉందని ఆనంద భాష్పాలతో వెంటనే అక్కడి పోలీసు వారి సహకారంతో మధిర పట్టణంలో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మెగావత్ రూప్లే భాయ్ 60 మావుటూరు తండా ,అర్ధవీడు (మండలం) ప్రకాశం (జిల్లా) అని తిరుపతిలో కుమార్తె వద్దకు వచ్చే సమయంలో భర్త తులసి నాయక్ వద్ద నుండి తప్పిపోయినదని ఆధారాలతో తెలియజేసి.. మధిర పట్టణ టౌన్ ఎస్సై సంధ్య పర్యవేక్షణలో కానిస్టేబుల్ తమ్మిశెట్టి శ్రీనివాసరాజు సమక్షంలో రూప్లే భాయ్ ని మనవడు వంశీ నాయక్ కు అప్పగించారు. ఎంతోమందిమతిస్థిమితం కోల్పోయిన వృద్ధులను మహిళను బంధువులకు అప్పగిస్తూ.. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మధిర టౌన్ పోలీసులను మరియు ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.