నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష
దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ
నేటి గదర్ న్యూస్, మార్చి 13.
మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 13.ఆదేశాల మేరకు MRPS MSP MSF ఆధ్వర్యంలో రిలే నిరాహార నిరసన దీక్షలు మూడవ రోజుకు చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి MEF నాయకులు పార్శపు ఏనుక మాదిగ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని తక్షణమే ఉద్యోగ నియమకాలు నిలిపి మాదిగ మాది గొప్పతనాలకు సమన్యాయం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థుల పట్ల పోలీసుల వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చాలా దారుణమని కచ్చితంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని కెసిఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని మాదిగల విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని రాజకీయ పతనం తప్పదని తక్షణమే ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి ఇచ్చిన మాట నిప్పుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కనకపుడి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేకల రాజా మాదిగ, మండల అధికార ప్రతినిధి దోర్నాల అంజి ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మారపాక ఆశీర్వాదం మాదిగ వెంకన్న మాదిగ, గద్దల పుల్లయ్య మాదిగ పాల్గొన్నారు