నేటి గదర్ న్యూస్,పినపాక:
మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆటపాటలతో గ్రామస్తులను వారి అల్లరించారు. గెలుచుకున్న నగదును ఊరి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు వారి తెలిపారు. ఆ గ్రామంలో సోలార్ ద్వారా మంచినీరు ఏర్పాటు చేసేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన గ్రోమోర్ నిర్వాహకులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని చాయ్ బిస్కెట్ ఛానల్లో ప్రసారం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మన గ్రోమోర్ రిటైల్ హెడ్ బాబు, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ శ్యాంసుందర్ నల్లూరి, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ రంజిత్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు పొనుగొటి భద్రయ్య మాజీ ఎంపీటీసీ కాయం శేఖర్ మాజీ సర్పంచ్ మొగల్ పల్లి నరసింహారావు మహర్షి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తోలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.