*వరంగల్ జిల్లా*
*05 ఫిబ్రవరి 2025*
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎస్.ఆర్.ఆర్.తోటలో డీ.మోహన్ రావు పబ్లిక్ హెల్త్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (ఏఐటియుసి అనుబంధం) జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ఉద్యోగులకు పదవీ విరమణ అనివార్యమని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అంటేనే ప్రజల ఆరోగ్య జాగ్రత్తల గురించి శ్రద్ధ చూసుకోవడం ఉద్యోగుల ప్రత్యేకమైన అని అన్నారు.. డి మోహన్ రావు మాట్లాడుతూ… పదవి విరమణ ప్రజ సేవకు అడ్డంకి కాదు అని నా శక్తి మేర జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని రిటైర్డ్ ఉద్యోగి మోహన్ రావు తెలియజేసారు, వైద్య సేవలో రాజ్యాంగ బద్ధంగా ఉద్యోగం చేయడం మావిధి అన్నారు. పదవి విరమణ పొందుతు 25 ఏళ్లు ఉద్యోగం చేసి ప్రజల మన్ననలు పొంది వైద్య ఆరోగ్యశాఖ నుండి పదవి విరమణ పొందడం నాకెంతో బాధ కలిగిస్తుందన్నారు.ఇటీ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నూకల అంజి, వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గూడెపు ప్రభాకర్ ,రామ
లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు…