తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.. టి బి జి కె యస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల.రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ మణుగూరు ఏరియా 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్ అందించారు.. అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలకు చీరలు అందించారు.. బాల వెలుగు పాఠశాలలో ఉన్న అనాథ పిల్లలచే కేక్ కటింగ్ చేపించి వారందరికీ మిఠాయి పొట్లం అందించారు.అనంతరం జయ శంకర్ సార్ టి బి జి కె యస్ కార్యాలయంలో కేక్ కటింగ్ చెసి సంబురాలు చేసుకొని శుభాకాంక్షలు అందించారు. టి బి జి కె యస్ గౌరవ అధ్యక్షురాలు గా ఉండి సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సంక్షేమం సాధించిపెట్టడం జరిగిందని తెలిపారు. కారుణ్య నియామకాలు,సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో ఆమె చేసిన పోరాటం పాత్ర మరువలేనిదని ఆమె సేవలు వారంత కొనియాడారు.. ఈ కార్యక్రమంలో టి బి జి కె యస్ నాయకులు ఇజ్రాయిల్, బంగారి పవన్ కుమార్, ముకేశ్, కోన వెంకటేష్,పడ్డం శ్రీనివాస్, వినోద్, కటారి ప్రసాద్, నాగరాజు, రేవన్, శ్రావణ్,శ్రీనివాస్ బి ఆర్ యస్ నాయకులు ఎనిక ప్రసాద్,రమణ , మచ్చ సమ్మక్క తదితరులు పాల్గొన్నారు
