– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్.
– సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం.
– లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ భరోసా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన కొమరం లాస్యశ్రీ కుటుంబానికి బిటిపిఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు అండగా నిలబడ్డారు. చిన్నారి లాస్యశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ లలిత ఇటీవల మృతి చెందడంతో అనాధగా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన కొమరం లాస్యశ్రీ ధీనగాధ విషయం తెలుసుకున్న బిటిపిఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్య శ్రీ కు అండగా నిలిచారు. అతి పేద కుటుంబానికి చెందిన లాస్యశ్రీ తల్లిదండ్రులు మరణంతో, కనీసం అంత్యక్రియలు ఖర్మ కాండలు జరిపించలేని దీనస్థితి. ఈ విషయమై పలు మాధ్యమాల్లో పోస్టింగులు చూసి చలించిపోయిన బీటీపీఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్యశ్రీ కి బాసటగా నిలవాలని నిర్ణయించుకుని, బి టి పి ఎస్ సీఈ బిచ్చన్న కు తెలిపారు. వెంటనే స్పందించిన సి బిచ్చన్న ప్రస్తుత ఖర్చులకు రూ,10 వేలు ఆర్థిక సాయం అందించడమే కాక, చిన్నారి లాస్య శ్రీ ఆరోగ్యం ఉన్నత చదువులకయ్య ఖర్చు మొత్తం బీటీపీఎస్ ఉద్యోగులు భరించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ఔదార్యాన్ని సీ ఈ బిచ్చన్న అభినందించి, కొమరం లాస్యశ్రీ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీ టీ పీ ఎస్ డీ ఈ సత్యనారాయణ, సేఫ్టీ డీ ఈ ఆనంద్ ప్రసాద్, ఏ డీ సత్యనారాయణమూర్తి, బి టి పి ఎస్ ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, ఉద్యోగులు ఆరిఫ్, సభా, అల్తాఫ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
