నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం న్యాయవాది ఊకే రవి పై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ దాడికి ప్రయత్నింస్తూ ఘర్షణ వాతావరణ సృష్టిస్తున్న గిరిజనేతరులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అశ్వరావుపేట నియోజకవర్గం తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గిరిజనేతరులు అక్రమంగా చొరబడి ఆదివాసీల భూములను అన్యాయంగా లాక్కోవడమే కాకుండా తిరిగి ఆదివాసుల పైన తిరగబడటం ఎంతవరకు సమంజసం అని ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అడ్డుకట్ట వేయటానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడుతున్న మా ఆదివాసి ముద్దుబిడ్డను కొందరు గిరిజనేతరులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనీ ఆలాంటి వారిని కఠినంగా శిక్షించాలనీ మా ఆదివాసీల జోలికి వస్తే సహించేది లేదు అని తుడుం దెబ్బ నాయకులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంబల్ల రవి, బండారు సూర్యనారాయణ, వాసం పోలయ్య తదితరులు పాల్గొన్నారు.
