విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసిన… BJP నాయకులు ఆపతి వెంకట రామారావు
ఏన్కూర్ :ఏన్కూర్ లో నిర్వహించిన తల్లాడ మండలం ఏన్కూర్ మండలం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో పలు కరెంటు తో రైతాంగ సమస్యలపై పరిష్కారం కొరకు స్థానిక రైతులు అన్నారు గూడెం గ్రామస్తులతో కలసి వినతి పత్రం సమర్పించిన ఆపతి వెంకట రామారావు భాజపా నాయకులు
తల్లాడ ఏన్కూర్ మండలంలో విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న సమస్యల పరిష్కార వేదిక గురించి కనీసం మన మండలంలోని విద్యుత్ అధికారులు కనీసం సూచనప్రాయమైన సమాచారం ఎవరికి ఇవ్వలేదు
తల్లాడ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నారుగూడెం గ్రామానికి గత 50 సంవత్సరాల క్రితం గ్రామంలో స్తంభాలు వేసి కరెంటు తీగలు తీయడం జరిగినది అవే స్తంభాలపై నేటి వరకు గృహ విద్యుత్తు కోసం సర్వీస్ వైర్లను తీసుకోవడం జరుగుతుంది కాలగమనంలో రోడ్డు అభివృద్ధి చెంది ఎత్తు పెరుగుతూ గృహాల సంఖ్య పెరుగుతూ సర్వీస్ వైర్ రోడ్డుకి అడ్డంగా తీసుకోవడం జరిగినది రవాణా సౌకర్యం లో రైతులు వినియోగించే టాక్టర్ ద్వారా మరియు లారీల ద్వారా రైతుల ధాన్యం తోలుకోవడానికి,స్కూల్ విద్యార్థుల కోసం వచ్చేటటువంటి బస్సులకు నిత్యం ఈ వైర్లు తగులుతూ రోజువారి గా పలు సమస్యలు ఏర్పడుతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్తంభాల ఎత్తు పెంచాలిఎత్తు స్తంభాలు వేయటం రెండు వైపులా స్తంభాలు వేసి సర్వీసు వైర్లను రోడ్డుకి అడ్డంగా లేకుండా చేసి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించనైనది
అన్నారుగూడెం గ్రామానికి పూర్తిస్థాయిస్థాయి లైన్ మెన్ అందుబాటులో ఉంచాలని మరియు రైతుల వ్యవసాయ కలక్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకునే విషయంలో ట్రాన్స్ఫర్ ప్రక్రియను సరళతరణం చేయాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగినది ఈ విషయంపై వచ్చిన అధికారులు స్పందించి ప్రజలకు చేరువ అయ్యేఅంశాలను తక్షణమే పరిష్కారం చేస్తామనిహామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలోభాజపా నాయకులు ఆపది వెంకట రామారావు కట్టా ఖాదర్ బాబా ఎల్లంకి సుధాకర్ గ్రామస్తులు చీకటి వెంకటేశ్వర్లు పలువురు రైతులు పాల్గొన్నారు.