నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు.
ఓటు హక్కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆయుధం. ఓటుతో నీ విలువ పెంచుకోవచ్చును. పైసలకు, కులానికి, మత్తుకు, ఓటును బలిచేయవద్దని చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి జీవి వెన్నెల అన్నారు. గురువారం ఖమ్మం వైరా రోడ్డు వేదిక కన్వెన్షన్ హాల్లో రచయిత కవి గాయకులు యశ్ పాల్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటు విలువ దాని ప్రాధాన్యత అనే అంశంపై సదస్సు జరిగినది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవి వెన్నెల మాట్లాడుతూ విద్యావంతులకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
చదువురాని పామరులు ఓటును చక్కగా వినియోగించుకుంటారని విద్యావంతులే కొంత జాప్టన్ చేస్తూ పాల్గొటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. విద్యావంతులు ఇతరులకు ఆదర్శవంతులుగా ముందు ఉండాలని విజ్ఞప్తి చేశారు. సారధి కళాకారులకు ఓటు హక్కు పై ప్రచారం చేయమని ఆదేశించారు.సారధి కళాకారులు, రచయిత యశ్ పాలు మాట్లాడుతూ ఖమ్మం భద్రాచలం జిల్లాలో ప్రచారం చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లు తప్పకుండా ఓటు హాల్ వరకు వచ్చేలా చూడాలని అందుకు ఆటపాట ద్వారా ప్రచారం విచిత్రంగా చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కవి రచయిత దేవేంద్ర, సుబ్రమణ్య కుమార్ ( ఖమ్మం కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ), జీవన్( విరసం ఆవిర్భావ సభ్యులు), ఖమ్మం కళాపరిషత్ నాగబత్తిని రవి, సాంస్కృతిక సేన చక్రాల రఘు, కానుగుల రాధాకృష్ణ. జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు పోలూరు రాము, పుల్లారావు, సారధి కళాకారులు మిమిక్రీ సుధాకర్, కాల్వకట్ల జాన్, పాగి వెంకన్న, బొమ్మెర ముత్యం, నకిరికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.