నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
చర్ల మండలంలోని
కొయ్యురు జాయింట్ సర్వేకు వచ్చిన అధికారులను శ్రీ సిర్రాజు మహిళా సొసైటీ సభ్యులు ,5 గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసులు అడ్డుకోని నిరసన వ్యక్తం చేశారు. గతంలో తమ శ్రీ సిర్రాజు మహిళా సొసైటీకి సర్వే చెయ్యకుండా , ఇప్పుడు వేరే సొసైటీ కి సర్వే ఎలా చేస్తారు అని అధికారులను ఐదు గ్రామాల ప్రజలు, నిలదీశారు. శ్రీ సిర్రాజు మహిళా సొసైటీ సభ్యులు ఐదు గ్రామాల గిరిజన గ్రామస్తుల నిరసన కు దిగివచ్చి న అధికారులు తాత్కాలికంగా సర్వే నిలువుదల చేశారు. తన సొసైటీ కి అన్యాయం చేస్తే సమీప భవిష్యత్తులో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Post Views: 102