సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి,
వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధికారులను కోరారు. రోజు ఇచ్చే కూలీలో కోత విధించవద్దని ఏడూళ్ల బయ్యారం, ఎల్సిరెడ్డిపల్లి తదితర గ్రామాల వ్యవసాయ కూలీలు నిర్వహిస్తున్న ఆందోళన కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం వ్యవసాయ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 300 రూపాయలు రైతులు చెల్లించే వారని, ఇప్పటి వరకు రైతులు, కూలీలు సమన్వయంతో పని చేసుకునేవారని అన్నారు. వేరే గ్రామాల నుండి మరియు వలస ఆదివాసీలను పోటీగా తీసుకొని వచ్చి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడంతో స్థానిక వ్యవసాయ కూలీలల్లో ఆందోళన మొదలైందని అన్నారు. రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేని వ్యవసాయ కూలీలు ఈరోజు ఉన్న నిత్యవసర సరుకుల ధరల దృష్ట్యా 250 రూపాయలతో ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో ప్రకారమే వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 385 రూపాయలు చెల్లించాలని చెబుతుంది. వారు చెల్లిస్తున్న 300 రూపాయలు కూడా తక్కువే అయినప్పటికీ రాజీపడి వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారని అన్నారు. అది కూడా తగ్గించి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడం సరి అయింది కాదన్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోతే రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై పోరాడాలి. కానీ వ్యవసాయ కూలీల వేతనాల్లో కోత పెట్టడం సరైనది కాదన్నారు. రైతులు పునరాలోచన చేయాలన్నారు. వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. వ్యవసాయ కూలీలు కూడా ఆవేశం తో తొందర పడకుండా ఆలోచనతో, ఐక్యంగా నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.