+91 95819 05907

జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నీ విజేత అగ్నిమాపక జట్టు.

పినపాక, , ఫిబ్రవరి 08:

పినపాక, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా అగ్నిమాపక జట్టు నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అగ్నిమాపక జట్టు, బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జట్టు తలపడ్డాయి. ఈ పోటీలో తొలుత బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు సాధించగా, 69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అగ్నిమాపక జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అగ్నిమాపక జట్టు క్రీడాకారుడు మధు కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా, టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన బిటిపీఎస్ క్రీడాకారుడు రమేష్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. విజేతలకు పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం వలన ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది అన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి క్రాంతి కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎన్.ఆర్.ఐ. కూనారపు ప్రసాద్, వినోద్ కుమార్, సతీష్ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్, భూరా శంకర్, కీసర సుధాకర్ రెడ్డి, ముక్కు మహేష్ రెడ్డి, సనప భరత్, కొంపెల్లి సంతోష్, గాడుదల దిలీప్, నగేష్, కోటి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

హోలీ పండుగ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 13:- హోలీ పండుగను ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ ప్రకటనలో తెలిపారు.హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల

Read More »

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

 Don't Miss this News !