హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 09.
మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండల కేంద్రంలో మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో హవేలీఘన్పూర్ బిజెపి కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా సంబరాలు నిర్వహించి పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. ఈ యొక్క గెలుపు తెలంగాణకి మలుపు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు తర్వాత అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఉద్దేశంతో ఈ యొక్క గెలుపుకు తోడ్పాటు అందించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు దళిత సోదరులు ఢిల్లీ ప్రజలందరికీ కూడా పేరుపేరునా మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకనుంచి అన్ని విజయాలే ఓటమనేది లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి హవేలీఘన్పూర్ మండల అధ్యక్షులు మధులపర్తి శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా నాయకులు శ్రీ పాల్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు కుమార్ నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్యామ్ గారు మరియు సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, మండల ఉపాధ్యక్షుడు రూపేందర్, ప్రభు, మరియు బీజేపీ మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ , మనోహర్, శివాజీ, భూత్ అధ్యక్షులు సత్యం,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.