భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. మరో వ్యక్తితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. వారి చెర నుంచి తప్పించుకున్న యువతి విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో సినీఫక్కీలో నిందితుడిని వారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన ఓ యువతి కొత్తగూడెం రామా టాకీస్ ప్రాంతాంలోని తమ బంధువల ఇంటికి వెళ్లేందుకు శనివారం కొత్తగూడెం బస్టాండ్‌కు వచ్చింది. యువతికి సరిగ్గా మాటలు రావు. దీంతో ఆమె చెప్పే అడ్రస్ ఆటో డ్రైవర్ గుగులోత్ కుమార్‌కు అర్థం కాలేదు. పక్కనే ఉన్న మరో డ్రైవర్ యువతి దగ్గర ఉన్న సెల్ నంబర్‌కు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కున్నాడు. అనంతరం కుమార్‌కు అడ్రస్ చెప్పాడు. యువతి ఆటోలో ఎక్కగా.. అందులో అప్పటికే మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఆమె చెప్పిన అడ్రస్‌కు కాకుండా డ్రైవర్ కుమార్ హేమచంద్రాపురం రోడ్డులోని రైల్వే గేట్ పక్కన గల అటవీ ప్రాంతంలోకి ఆమె పై అఘాత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు.
