నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట:
తల్లి బైక్ కొనివ్వలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. అశ్వారావుపేట ఫైర్ కాలనీకి చెందిన చీకటి స్వామి(20) గత కొన్ని రోజులుగా బులెట్ బైక్ కొనివ్వాలని తల్లిని అడుగుతున్నాడు. ఈరోజు ఖర్చులకు డబ్బులు అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Post Views: 24