నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళా నందు వనవాసి క్షేత్ర సంఘటన మంత్రి శివరామకృష్ణ సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనవాసి ఆదివాసి కళాకారులు రేళా నృత్యాన్ని ప్రదర్శించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళా కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు దేశం నలుమూలల ఉన్న వనవాసి ఆశ్రమానికి చేందిన ఆదివాసి కళాకారుల తమ తమ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆదివాసి కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు నిర్వహించం జరిగిందని ఆయన అన్నారు.ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన వనవాసి బాధ్యులు కోరం రామారావు గొంది శోభన్ బాబు ఆధ్వర్యంలో వనవాసకి చెందిన మూపై నాలుగు మంది ఆదివాసి కళాకారుల రేళా నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ ప్రదర్శిన అమాంతం చూపరుల మనసు మదిని పులకించేలా కన్నుల విందుగా కళాకారులు తమ రేళా నృత్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు.
