నేటి గదర్ న్యూస్ :వైరా నియోజకవర్గ ప్రతినిధి
కొణిజర్ల :దేశ రక్షణకోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు సైన్యంపై యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆర్మీ జవాన్ ల త్యాగాలు మరువలేమని వైరా నియోజక వర్గ ఎమ్మెల్యే మాలోత్.రాందాస్ నాయక్ అన్నారు.మండల పరిధిలోని అన్నవరం గ్రామంలో ఆర్మీ జవాన్ చెల్లా.శ్రీనివాస్ గత ఏడాది రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు.అన్నవరం గ్రామంలోనీ తన వ్యవసాయక్షేత్రంలో కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ సత్యమూర్తి అరుణ్ చేతుల మీదగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతి చెందిన ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కుటుంబ వివరాలను తల్లి దండ్రులైన చెల్లా.సీతమ్మ,వెంకటేశ్వర్లునుఅడిగి తెలుసుకొన్నారు.పుట్టిన వాడు గిట్టక తప్పదని కుటుంబాన్ని ,భార్య పిల్లలను సైతం వదిలి దేశభక్తిపై ప్రేమతో ప్రజల రక్షణకై బోర్డర్ లో ఆర్మీ జవాన్ గా ఉద్యోగం చేస్తారని యుద్ధంలో వారు మరణం పొందిన ప్రజల గుండెల్లో ఎప్పుడు పదిలంగానే వుంటారని తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చెల్లా.అంజయ్య,కృష్ణయ్య నీలమ్మ,దేవి,లోకేష్, హర్షిత,ప్రణవి,సంపూర్ణ,గాయిత్రి లను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఓదార్చారు.ఎప్పుడు మీకు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు పేట్ల.కృష్ణమూర్తి, కాంగ్రస్ పార్టీ జిల్లా నాయకులు బొర్రా.రాజశేఖర్,సూరంపల్లి.రామారావు,ప్రధానోపాధ్యాయులు అచ్యుత్ రమణారావు, కోసూరి.శ్రీనివాసరావు,చేరుకుమల్ల.రవి,గుండ్ల.కోటేశ్వరరావు, చింతనిప్పు.నరసింహారావు, కమటల.రేణుక,రాయల.పుల్లయ్య,ఐవిఒ జిల్లా అధ్యక్షులు జిడుగు. హనుమంతు రావు,గోపాల్ రావు,సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు ధమ్మలపాటి.సుధాకర్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ళ.శ్రీనివాస్,వెంకన్న, పి.వెంకటరాజు,చల్లా.నరసింహారావు, భద్రాజి,సత్యనారాయణ,ఎల్లయ్య,గోగుల.ఉపేందర్ పాల్గొని నివాళులు అర్పించారు.