★నిరుపేదలకు కళ్లద్దాల పంపిణీ.
నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
వైరా : ఈరోజు వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో అనోక్ కంటి హాస్పిటల్ ( అనోక్ హైకేర్ సెంటర్ ) వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని పేదలకు కళ్లద్దాలు పంపిణీ చేసినారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 110 మందికి కంటి పరీక్షలు చేయగా, వా రిలో అర్హులైన నిరుపేదలకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన లభించిందని గ్రామంలో ఇలాంటి సేవలు మరెన్నో చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు మాధవి, అనోకరావ్, హుస్సేనమ్మ, వెంకటేశ్వర్లు, అలేఖ్య, గ్రామ మాజీ సర్పంచ్ చింతనిప్ప కరుణాకర్ రావు, మాజీ ఎంపీటీసీ తడికమళ్ళ నాగేశ్వరరావు, చింతనిప్పు రామారావు , వాసిరెడ్డి రామారావు అనుమోలు వెంకటేశ్వర్లు ( స్వామి), తెనాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.